సారథి న్యూస్, ములుగు: స్వయం సహాయక సంఘాల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందజేస్తున్నరుణాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదర్శసురభి సూచించారు. మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్లో జరిగిన రివ్యూ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డెయిరీ వంటి పథకాలను అర్హత కలిగినవారికి మంజూరు చేయాలని సూచించారు. అలాగే ప్రతి మండలంలో క్యాంటీన్ ఏర్పాటుకు స్థలపరిశీలన కోసం తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఐదుగురు సభ్యులు ఉన్న గ్రూపునకు లోన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఎల్ డీఎం ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రతి పథకం అమలవుతున్న తీరుపై గ్రౌండింగ్‌పై ఫొటోలు అప్‌లోడ్‌చేయాలని సూచించారు. సమావేశంలో కార్యక్రమంలో నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, ఆర్బీఐ ప్రతినిధి అనిల్ కుమార్, డీఆర్డీవో పారిజాతం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి, ఏపీడీ శ్రీనివాస్, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, సంజీవరావు, జిల్లా వ్యవసాయాధికారి గౌస్ హైదర్ పాల్గొన్నారు.
- February 16, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- MULUGU
- NABARD
- WARANGAL
- నాబార్డు
- ములుగు
- వరంగల్
- స్వయం ఉపాధి రుణాలు
- Comments Off on పథకాలు మంజూరు చేయండి