Breaking News

సర్వేను పరిశీలించిన సర్పంచ్

సర్వేను పరిశీలించిన సర్పంచ్

– రేణికుంటలో ఇంటింటి సర్వే… గ్రామస్తులకు పలు సూచనలు చేసిన సర్పంచి

సారథి, కరీంనగర్ ప్రతినిధి: లక్షణాలు ఉంటే కరోనా టెస్టులు చేసుకోవాలని రేణికుంట సర్పంచి బొయిని కొమురయ్య అన్నారు. ఈ సందర్భంగా శక్రవారం గ్రామంలో నిర్వహించిన ఇంటింటా సర్వేను పరిశీలించి మాట్లాడారు. గ్రామంలోని ఎవ్వరికైన కొవిడ్ సింటమ్స్ అయిన దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉంటే తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు.  వ్యాధి తీవ్రతరం కాకముందే తమకు నిర్భయంగా చెప్పుకుంటే సరైన వైద్యం అందిస్తామన్నారు. పాజిటివ్ సింటమ్స్ ఉండి చెప్పకుండా వివిధ శుభకార్యక్రమాలు, పర్వదినాలకు హాజరవ్వడం ద్వారా మీ కుటుంబ సభ్యులు, సహచరులు, బంధువులు, గ్రామస్తులు అనేకంగా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందన్నారు. గ్రామపంచాయతీ నిబంధనల ప్రకారం గ్రామస్తులేవ్వరూ మాస్కు లేకుండా బయట తీరగొద్దన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్, అంగన్ వాడి టీచర్లు నల్లాల రజిత, ల్యాగల స్వరూప, ఆశావర్కర్లు ఎలుక విజయ, కర్ర అరుణ, ఐకేపీ సీఏలు మెడిషెట్టి శ్రీధర్, ఎలుక లక్ష్మి, గ్రామపంచాయితీ సిబ్బంది చింతల శ్రీనివాస్, గంగారాపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.