సారథి న్యూస్, ములుగు: జిల్లా సరిహద్దుల్లో నిఘా పక్కాగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ఎస్.కృష్ణఆదిత్య సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు రహదారి నుంచి కలప, ఇసుక, పీడీఎస్ బియ్యం, మారకద్రవ్యాల స్మగ్లింగ్ అవుతోందని, జిల్లా నలువైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా అధికారులతో కలెక్టరేట్ లో రోడ్ సేఫ్టీ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు వేయడం, రేడియం స్టిక్కర్లు అతికించడం, కలరింగ్ వేయాలని సూచించారు. అంబులెన్స్‌లను రెఫరల్ కేసులకు ఉపయోగించాలన్నారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాలను అనుమతించొద్దని హెచ్చరించారు.
ఫుట్‌పాత్ షాపులను తొలగించాలని, వాహనాల పార్కింగ్ కు జూనియర్ కాలేజీ గ్రౌండ్ను ఏర్పాటుచేయాలన్నారు.ఏఎస్పీ సాయిచైతన్య మాట్లాడుతూ.. నేషనల్ హైవే పరిదిలో ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత శాఖల అధికారులు బాధ్యత వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో హనుమంతు కే జడంగే, జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదర్శ సురభి, డీఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి, జిల్లా వైద్యాధికారి అప్పయ్య, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.జగదీశ్వర్, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి అరవింద్ రెడ్డి, సి.రవి, ఆర్టీసీ డీఎం రూరల్ శ్రీదేవి, ఆర్టీసీ డీఎం వరంగల్ అర్బన్ మహేష్ కుమార్, ఆర్ అండ్ బీ ఈఈ వెంకటేశ్, నేషనల్ హైవే ఏఈ బాబు పాల్గొన్నారు.