- రైతు కష్టాన్ని నమ్ముకొని జీవిస్తాడు
సామాజిక సారథి, ములుగు: భూమాతను అమ్మగా భావించి, కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న రైతన్న జీవితం గొప్పదని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా అన్నారు. ఆదివారం సెలవు రోజున ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన మమిడిశెట్టి సాంబయ్య, వనమాల దంపతుల మిరుపతోటలో కూలీలతో కలిసి మిరపకాయలు (ఎరారు) కోశారు. రోజంతా పని చేసినందుకు గాను రూ.200ల కూలీ డబ్బులు ఇచ్చారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ నాగరిక సమాజంలో వ్యవసాయం యొక్క ప్రాధాన్యత తెలియక రైతు విలువను మర్చిపోతున్నారన్నారు. కూలీగా వచ్చిన డబ్బులతో పాటు మరీ కొంత కలిపి ఓ వృద్ధ కూలికి అందించారు.