సామాజిక సారథి, ములుగు: ఎస్టీయూ ములుగు జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ ఆధ్వర్యంలో మోడల్ స్కూలు, బండారుపల్లి, జాకారం, మల్లంపల్లి, కోయగూడం, భూపాల్ నగర్ ప్రభుత్వ స్కూళ్లలో యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన టీచర్ల రేషనలైజేషన్ జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తూ పాత జిల్లాల ప్రకారం పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూలు టీచర్లకు 010 ద్వారా వేతనాలు చెల్లించి హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని కోరారు. కేజీబీవీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ మండలాధ్యక్షుడు గన్నోజు ప్రసాద్, వెంకటాపూర్ మండలాధ్యక్షుడు బండారి జగదీశ్, గోవిందరావుపేట అధ్యక్షుడు పోరిక రాజన్న, ములుగు ట్రెజరర్ రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.
- August 18, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- kgbv
- MULUGU
- STU
- ఎస్టీయూ
- ములుగు
- రేషనలైజేషన్
- Comments Off on ఎస్టీయూ సభ్యత్వ నమోదు