Breaking News

లాక్ డౌన్ గీత దాటితే కఠిన చర్యలు

లాక్ డౌన్ గీత దాటితే కఠినచర్యలు

సారథి, పెద్దశంకరంపేట: తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అల్లాదుర్గం సీఐ జార్జ్ హెచ్చరించారు. బుధవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నాందేడ్- అకోలా 161వ జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలతో బయటికి వస్తున్న పలువురికి జరిమానాలు విధించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం బయటకు రావాలని, 10 గంటల తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పలు వాహనదారులకు దుకాణదారులకు జరిమానా వేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలంతా లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. సంతలో భౌతికదూరం పాటిస్తూ సరుకులు కొనాలని సూచించారు. ఆయన వెంట పేట ఎస్సై నరేందర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.