మాసివ్ బ్లాక్ బ్లస్టర్ ‘అఖండ’ చిత్రాన్ని అందించిన బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బోయపాటిరాపో ని డైరెక్ట్ చేస్తున్నారు. హీరో రామ్‌కి జోడిగా శ్రీలీల నటిస్తోంది. ఈరోజు చిత్ర షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది. దర్శకుడు బోయపాటి, రామ్ శ్రీలీలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. బోయపాటి, రామ్‌ని మాస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బోయపాటిరాపో హిందీ, అన్ని సౌత్ ఇండియన్ భాషలలో విడుదల అవనుంది.
- January 5, 2023
- Archive
- CINEMA GALLERY
- Top News
- ముఖ్యమైన వార్తలు
- BOYAPATI
- Cinema
- Sri Leela
- Srinu Boyapati
- Comments Off on బోయపాటి సెట్స్‌లో శ్రీలీల