![అంతర్జాతీయ ఉపాధ్యక్షుడిగా శ్రీధర్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/12/12HSB7.jpg?fit=525%2C350&ssl=1)
సామాజిక సారథి, సంగారెడ్డి: వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులుగా 2022 వ సేవ సంవత్సరానికి సంగారెడ్డి పట్టణానికి చెందిన చంద శ్రీధర్ ఎన్నికయ్యారు. విజయవాడ పట్టణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన చంద శ్రీధరతో అంతర్జాతీయ అద్యక్షలు పాత సుదర్శన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్బంగా వాసవి క్లబ్ జిల్లా ప్రతినిధులు చంద శ్రీధర్ ను అభినందించారు.