సంక్రాంతి సినిమాల్లో చిరు-బాలయ్యల వాల్తేరు వీరయ్య.. వీరసింహారెడ్డిలతో సమానంగా వార్తల్లో నిలిచిన అనువాద చిత్రం ‘వారసుడు’. పండుగ రేసులో 11నే తమిళనాడులో ‘వారిసు’ గా రిలీజైన ఈ చిత్రం అక్కడ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది. తెలుగులో ‘వారసుడు’. రష్మిక మందాన్న హీరోయిన్ ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, కిక్ శ్యామ్,సంగీత, యోగిబాబు, ప్రభు కీలకపాత్రల్లో నటించారు. అయితే టాలీవుడ్లో ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడి చివరగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ “వారసుడు” లో దళపతి విజయ్ అన్ని కోణాల్లో ఆకట్టుకున్నాడు. కొన్ని చోట్ల ఎమోషన్స్ కామెడీ వర్కవుట్ అయ్యాయి. కానీ సినిమాలో నిడివి పెద్ద సమస్య అని చెప్పాలి. చాలా అనవసర సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది. ఇవి పక్కన పెడితే ఈ ఫ్యామిలీ డ్రామా ఈ పండుగలో ఓ మోస్తరు ఎంటర్టైన్మెంట్ మాత్రమే అందిస్తుంది.
- January 16, 2023
- CINEMA GALLERY
- Top News
- సినిమా
- dalapati vijay
- VIJAY
- దళపతి విజయ్
- వారసుడు
- Comments Off on చతికలబడ్డ ‘వారసుడు’