సారథి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి పదవీకాలం ముగియనున్న సందర్భంగా వారి దంపతులను గజమాలతో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య సోమవారం ఘనంగా సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రకృతి వనం కార్యక్రమాన్ని జిల్లాలో పరుగులు పెట్టించిన ఘనత ఆయనదేనని కొనియాడారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నా జిల్లా ప్రజల పరిరక్షణలో అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ చేపట్టిన కార్యక్రమాలు అమోఘమైనవని కొనియాడారు. వారి శేషజీవితం కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, జడ్పీ సీఈవో విద్యాలత, జడ్పీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి రాజేష్, జడ్పీటీసీలు బరపాటి వాసుదేవరావు, పైడి వెంకటేశ్వర్లు, కామిరెడ్డి శ్రీలత పాల్గొన్నారు.
- May 31, 2021
- Archive
- Top News
- collector mv reddy
- KOTHAGUDEM
- PRAKRUTHIVANAM
- కలెక్టర్ ఎంవీ రెడ్డి
- కొత్తగూడెం
- పల్లెప్రకృతి వనం
- వీడ్కోలు
- Comments Off on కలెక్టర్ కు ఆత్మీయ వీడ్కోలు