సామాజిక సారథి, తలకొండపల్లి: ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చొరవతో పనుల్లో వేగం పెరిగినట్లు గ్రామ సర్పంచ్ హైమావతి రామస్వామి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాయపల్లి గ్రామంలోని శ్రీఆంజనేయ స్వామి దేవాలయానికి విద్యుత్ స్తంభాలు, లైటింగ్ వైర్ సప్లై పనులను తన సొంత ఖర్చులతో చేయించడం సంతోషకరమన్నారు. ప్రతి ఏడాదికి ఒక్కసారి జరుపుకునే పవిత్రమైన పండగలు చీకటిలోనే జరిగేవన్నారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చొరవతో పనులు జరగడం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నూనె రాఘవేందర్, లింగం గౌడ్, నరేందర్ గౌడ్ ,మేక భరత్ రెడ్డి, బోయ కిషన్, మిన్నాల వినయ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
- November 1, 2022
- Archive
- లోకల్ న్యూస్
- CHAIRMAN
- Foundation
- Panlow
- Ranga Reddy
- Speed
- Unity
- Comments Off on ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ చొరవతో పనుల్లో వేగం