సారథి న్యూస్, నిజాంపేట: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తున్న శ్రీరామ జన్మభూమి నిధి సమర్పణ అభియాన్ లో భాగంగా శుక్రవారం మెదక్ జిల్లా నిజాంపేట పట్టణంలో జనజాగరణ ప్రారంభ పూజాకార్యక్రమం నిర్వహించారు. రామమందిర నిర్మాణానికి అయ్యే నిధుల సేకరణ కార్యక్రమానికి అందరి నుంచి అపూర్వ మద్దతు లభించింది. కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర మెదక్ జిల్లా సంయోజక్ పబ్బ సత్యనారాయణ, జిల్లా సహ సంయోజక్ బండి వెంకటేశ్వర్లు, రామాయంపేట సహ సంయోజక్ పుట్టి మల్లేశం, రామయంపేట ఖండ సహ కార్యవహ కొమ్మాట నరేందర్, జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్, సర్పంచ్ గెరిగంటి అనూష, ఉపసర్పంచ్ కొమ్మాట బాబు, నర్సింహులు, జీడి మల్లేశం, తమ్మలి రమేశ్, రామగౌడ్ పాల్గొన్నారు.
- January 23, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- AYODYA
- medak
- RAMAMANDIRAM
- SRIRAMA JANMABHUMI
- అయోధ్య
- మెదక్
- రామమందిరం
- శ్రీరామ జన్మభూమి
- Comments Off on ‘శ్రీరామమందిర’ నిధికి విశేష స్పందన