సారథి, రామడుగు: చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నియోజకవర్గ సమస్యలను వదిలి హుజురాబాద్ లో ప్రచారం చేయడం ఏమిటని కాంగ్రెస్ ఇన్చార్జ్మేడిపల్లి సత్యం విమర్శించారు. శనివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో పలు తూముల నిర్మాణానికి వేసిన శిలాఫలకాలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రూ.165కోట్ల వ్యయంతో తూములు నిర్మిస్తామని చెప్పి రెండేళ్లు అవుతున్నా రెండు రూపాయల పనిచేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో యావత్ తెలంగాణకు నీటిని తీసుకుపోవడం బాగానే ఉన్నా ఇక్కడి భూములకు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. నియోజకవర్గాన్ని కోనసీమగా మారుస్తానన్న ఎమ్మెల్యే కొత్త ఆయకట్టు కింద కనీసం ఒక్క ఎకరానికైనా నీరిచ్చారా? చెప్పాలని సవాల్విసిరారు. సమావేశంలో కాంగ్రెస్పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మరవేని తిరుపతి, ఎంపీటీసీ జవ్వజి హరీశ్, వెన్న రాజమల్లయ్య, పులి ఆంజనేయులు, బాలగౌడ్, బాపిరాజ్, సాయిండ్ల నర్సింగం పాల్గొన్నారు.
- June 26, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHOPPADANDI
- MLA RAVISHANKAR
- RAMADUGU
- ఎమ్మెల్యే రవిశంకర్
- చొప్పదండి
- రామడుగు
- Comments Off on ముందు ఇక్కడి సమస్యలు పరిష్కరించు