Breaking News

ధరణితో భూసమస్యలకు పరిష్కారం

ధరణితో భూసమస్యలకు పరిష్కారం

  • అన్ని భూముల డిజిటలైజేషన్
  • ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రూ.10లక్షల వ్యయంతో నిర్మించనున్న రెస్ట్ రూం, సురక్షిత తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఆఫీస్ రినవేషన్ రూం పనులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ కు వచ్చే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. గతంలో తహసీల్దార్ ఆఫీసుకు వచ్చేవారు చెట్లకింద కూర్చునేవారని, కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవన్నారు. గతంలో మ్యుటేషన్ కోసం నెలల నుంచి తిరగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో ధరణి కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్లు అయిన వెంటనే డిజిటల్ పాస్ పుస్తకాల్లో ప్రింట్ చేసి ఇస్తున్నట్లు తెలిపారు. కొత్తగా పాస్ బుక్కు తీసుకునే వారికి నేరుగా వారి ఇంటికి పంపిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే డిజిటల్ సర్వే కూడా ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఆర్డీవో నరేందర్, ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల వినయ్ సౌజన్య, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ భూంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ ఇప్పనపెల్లి విజయలక్ష్మి, సాంబయ్య, పాక్స్ చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.