సారథి, కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం కడ్తాల్ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ మొదటి కుమారుడు రాధాకృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, జడ్పీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కల్వకుర్తి జడ్పీటీసీ పోతుగంటి భరత్ ప్రసాద్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన స్మారకార్థం నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమనగల్లు జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్, కేశంపేట, కొత్తూరు, జడ్పీటీసీలు, కడ్తాల్ సర్పంచ్ ఎల్ ఎన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
- July 14, 2021
- Archive
- KALWAKURTHY
- MP RAMULU
- zptc's
- కడ్తాల్
- కల్వకుర్తి
- Comments Off on జడ్పీటీసీ కుమారుడికి ఎంపీ, ఎమ్మెల్యే ఘననివాళి