- కొవిడ్ కాటుకు కానిస్టేబుల్ భీమయ్య మృతి
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పోలీస్ కమిషనర్, అడిషినల్ ఎస్సీ
సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: కరోనాతో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేట గ్రామానికి చెందిన బైరినేని భీమయ్య(47) సిద్దిపేట జిల్లా కొహెడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. భీమయ్యకు నాలుగు రోజుల క్రితం కరోనా సోకింది. పరిస్థతి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలోని కరోనా ఐసొలేషన్ వార్డులో అడ్మిట్ చేయగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కరోనాతో కానిస్టేబుల్ మృతి చెందడం సిద్దిపేట జిల్లాలోనే ప్రపథమం. అనంతరం పోలీస్ కమిషన్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా అండగుంటుదని సీపీ ధైర్యం చెప్పారు. హుస్నాబాద్ డివిజన్ అడిషినల్ ఎస్పీ సందెపోగు మహేందర్, సీఐ రఘుపతిరెడ్డి, కొహెడ ఎస్సై రాజకుమార్, రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, కొహెడ పోలీస్ స్టేషన్ సిబ్బంది నివాళులర్పించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.