Breaking News

ఆపన్నులకు అండగా ‘సర్వర్ ట్రస్ట్​’

ఆపన్నులకు అండగా ‘సర్వర్ ట్రస్ట్​’

సారథి, వెంకటాపూర్: ఆదివాసీ గిరిజన తండావాసులకు సర్వర్ చారిటబుల్ ట్రస్ట్​, ఫౌండేషన్​ అండగా నిలిచింది. ఇండ్లు కాలిపోయి సర్వం కోల్పోయిన గొత్తికోయలకు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. విద్య, వైద్యంతో పాటు కనీస సౌకర్యాలు పొందాలంటే గ్రామాలకు దగ్గరగా నివాసాలను ఏర్పాటు చేయాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కోరారు. రెండు రోజుల క్రితం బూర్గుపేట పరిధిలోని సకారిరేవులు గొత్తికోయగూడెం వాసుల ఇండ్లు కాలిపోయాయి.

తినడానికి తిండిలేక దిక్కుతోచని స్థితిలో బాధితులు ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ ను సంప్రదించారు. వారి పరిస్థితిని తెలుసుకున్న తస్లీమా మంగళవారం సాయంత్రం వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకుని చలించిపోయారు. సర్వర్ చారిటబుల్ ట్రస్టు, ఫౌండేషన్​ఆధ్వర్యంలో 20 కుటుంబాలకు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు, కూరగాయలను అందజేశారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ.. ఆదివాసీలకు విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. తస్లీమా వెంట ఫౌండేషన్ సభ్యులు మామిడిపల్లి రమేష్, రాసమల్ల హేమంత్, చంటి శామ్యూల్, చంటి అనిల్, చంటి జాన్, బొల్లవేన రాజ్ కుమార్, గండ్రకోట మధు, పూసల పవన్, బొల్లవేని రమేష్, గ్రామస్తులు మొగిలి, కోట అంజయ్య పాల్గొన్నారు.