సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కొహెడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం వరుకోలు గ్రామానికి చెందిన బాలగొని వేణు అదే గ్రామానికి చెందిన దొనపాని కనుకవ్వ ఇంటి సమీపంలో ప్రభుత్వ నిషేధిత గుట్కాలు, పొగాకు అంబార్ ప్యాకెట్లు నిల్వచేసినట్లు సమాచారం రావడంతో ఎస్సై రాజ్ కుమార్ తన సిబ్బందితో కనుకవ్వ ఇంటిపై దాడులు చేశారు. రూ.2,72,200 విలువైన అంబార్, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకాలపాలకు పాల్పడుతున్న నిందితులపై కేసునమోదు చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై రాజు కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- March 26, 2021
- Archive
- క్రైమ్
- ACP MAHENDAR
- guthka pockets
- HUSNABAD
- SIDDIPETA
- ఏసీపీ మహేందర్
- కొహెడ
- గుట్కా ప్యాకెట్లు
- సిద్దిపేట జిల్లా
- హుస్నాబాద్
- Comments Off on పొగాకు గుట్కా, అంబార్ ప్యాకెట్ల పట్టివేత