Breaking News

సవేరా సేవలు అభినందనీయం : నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్

సామాజిక సారథి , కర్నూల్:
శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లే శివ స్వాముల కోసం సేవా శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని సవేరా మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్ అభినందించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాలినడకన నాగర్ కర్నూల్ ప్రాంతం నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రానికి చేరుకునే శివ స్వాములు కోసం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ వద్ద ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి, షాహిస్తా న్యూ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ముస్లిం మైనార్టీ యువకులు ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంప్, పండ్లు పానియాల వితరణ కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ రామేశ్వర్ తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై ఎస్పీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ శివ స్వాముల పట్ల మైనార్టీ యువకుల సేవలు ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు యువత ముందుకు రావడం గర్వించదగినదన్నారు. ఇలాంటి కార్య క్రమాల వల్ల మాట సామరస్యం వెళ్లి విరుస్తుందన్నారు. ఈ సందర్బంగా కాలినడకన వెళ్లే శివ భక్తులకు ఫిజియోట్రాపి ఉపకారణాలచేత మర్దనాలు చేశారు. కాళ్లకు గాయాలైన వారికి చికిత్సలు అందించారు. అవసరమున్న వారికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ న్యూ లైఫ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి సమీర్, మాడ్రన్ స్వీట్ హౌస్ ముంతాజ్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు బి. వెంకటేష్, కౌన్సిలర్లు ఖాజా ఖాన్, ఎండి. ఇసాక్, బచ్చన్న యాదవ్, వక్ఫ్ కాంప్లెక్స్ మేనేజింగ్ కమిటీ కార్యదర్శి పఠాన్ అబ్దుల్లా ఖాన్ , అరబ్బీ పాఠశాల కార్యదర్శి సయ్యద్ రఫీయొద్దిన్ , మెరాజ్ మజీద్ కమిటీ అధ్యక్షుడు ముబీన్ ఖాన్, ఎంహెచ్ఎస్ఎస్ అధ్యక్షుడు నిజాం, సవేరా మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం, టీఎన్జీవో సభ్యులు కరీముల్లా, రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకుడు నసీర్, నాగర్ కర్నూల్ ముస్లిం యూత్ పాల్గొన్నారు.