సారథి, రామడుగు: ఆపదలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుడి పట్ల సర్పంచ్ ఔదార్యం చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడు రేణిగుంట రాజమల్లయ్య శనివారం అనారోగ్యానికి గురైయ్యాడు. ఆయనను వెంటనే కరీంనగర్ సిటీ దవాఖానకు తరలించగా ట్రీట్మెంట్ పొందుతున్నాడు. గోపాల్రావుపేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న వెంకట్రామిరెడ్డి శనివారం రాజమల్లయ్యను పరామర్శించి రూ.15వేలు అందజేశారు. వైద్యచికిత్సల కోసం అండగా ఉంటామని భరోసా కల్పించారు.
- July 31, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- goplaraopet
- RAMADUGU
- గోపాల్రావుపేట
- రామడుగు
- Comments Off on సర్పంచ్ ఔదార్యం