- 14న ముగియనున్న చైర్మన్కె.శివన్ పదవీకాలం
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త చైర్మన్ గా అంతరిక్షశాఖ కార్యదర్శి, రాకెట్ శాస్త్రవేత్త ఎస్.సోమనాథ్ నియమితులయ్యారు. కె.శివన్ పదవీకాలం ఈనెల 14వ తేదీతో ముగియడంతో ఆయన స్థానంలో ఎస్.సోమనాథ్ ను నియమించారు. తిరువనంతపురంలోని విక్రం సారభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ గా ఆయన పనిచేస్తున్నారు. ఉపగ్రహ వాహన నౌకల డిజైనింగ్ లో సోమనాథ్ కీలకపాత్ర పోషించారు. కేరళకు చెందిన ఎస్.సోమనాథ్ కొల్లంలోని టీకేఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో యూజీ డిగ్రీ, భారతదేశం ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ పూర్తిచేశారు. 1985లో సోమనాథ్ ఇస్రోలో చేరారు. కేరళ శాస్త్రవేత్తలు జి.మాధవన్ నాయర్, డాక్టర్ కె.రాధాకృష్ణన్ 2003 నుంచి 2014వరకు అంతరిక్ష సంస్థకు నాయకత్వం వహించారు. కాగా, ఎస్.సోమనాథ్ అగ్రస్థానికి చేరుకున్న మూడో మలయాళీ కావడం విశేషం.