సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మెదక్ డీపీవో తరుణ్ కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం పెద్దశంకరంపేట ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పంచాయతీ కార్యదర్శుల వివరాలను సూపరింటెండెంట్ రాజమల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల పనులను తొందరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రియాజుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ చక్రధర్, సిబ్బంది తుకారాం తదితరులు పాల్గొన్నారు.
- February 3, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- medak
- PALLEPRAKRUTHI
- PEDDASHANKARAMPET
- పెద్దశంకరంపేట
- మెదక్
- వైకుంఠధామాలు
- Comments Off on పల్లె అభివృద్ధి పనులను పూర్తిచేయాలి