Breaking News

నల్లా కనెక్షన్ పైపు పైనే రహదారి నిర్మాణం

నల్లా కనెక్షన్ పైపు పైనే రహదారి నిర్మాణం..

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ఇంజినీర్ల పని తనానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఈ చిత్రం. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి నుంచి మినీ ట్యాంక్ బండ్ (కేసరి సముద్రం చెరువు)కు వెళ్లే దారిలో ఇంటికి నల్ల కనెక్షను ఇచ్చిన పైపులైను పూడ్చకుండానే రహదారి వేశారు. బరువుకు అణిగే ప్లాస్టిక్ పైపుల్లోంచి నీరు ఎలా వస్తుందో ఆ ఇంజినీర్లకే తెలియాలి. ఇప్పటికే రహదారికి రెండు వైపులా పైపులైన్లు నిర్మించాలన్ననిబంధన ఉన్నా ఒకేవైపు నిర్మించి,  రెండు వైపులా ఉన్న ఇళ్లకు నల్ల కనెక్షన్లు ఇ చ్ఛేసి తప్పిదం చేసిన ఇంజినీరింగ్ అధికారులు ఇప్పుడు మరో తప్పిదం చేస్తున్నారు. గతంలో ఇలాగే నల్ల కనెక్షన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఇవ్వకుండానే పలు కాలనీల్లో సీసీ రహదారులు వేసి అభాసుపాలయ్యారు. అయిన అధికారులు అదే తీరుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఇంజినీర్ల ఘనతను చూసి దారిన వెళ్లేవారు నవ్వుకుంటున్నారు.