సారథి న్యూస్, హుస్నాబాద్: అతనొక సాధారణ ఆర్ఎంపీ. రోజుకు పదో పరకో సంపాదించి కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ ఉన్నట్టుండి సదరు వ్యక్తి ఇంట్లో శనివారం లక్షల రూపాయలు బయటపడ్డాయి. అధికారులు సోదాలు జరిపి వెలికితీయడంతో స్థానికులు కంగుతిన్నారు. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ కథనం మేరకు.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ ఆంజనేయులు ఇంట్లో టాస్క్ ఫోర్స్, పోలీసు ఉన్నతాధికారులు సోదాలు చేయగా రూ.66.11లక్షలు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న నగదును ఐటీ శాఖ అధికారులకు అప్పగించడంతో పాటు ఆర్ఎంపీ వైద్యుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోదాల్లో హుస్నాబాద్ సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు శ్రీధర్, రవి, టాస్క్ ఫోర్స్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- March 6, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- HUSNABAD
- RMP
- SIDDIPETA
- ఆర్ఎంపీ
- సిద్దిపేట
- హుస్నాబాద్
- Comments Off on ఆర్ఎంపీ ఇంట్లో డబ్బు సంచులు