సామజిక సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెదిర కిమ్స్ లా కాలేజ్ లో శనివారం టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రొఫెసర్లకు బొకే ఇచ్చి సన్మానించారు. సమాజంలో న్యాయవాద వృత్తి ఉన్నతమైందని కొనియాడారు. కార్యక్రమంలో లా కాలేజీ అడ్మిన్ రవీంద్ర, ప్రొఫెసర్లు వెంకటస్వామి, కిషన్, కొమురయ్య, రంగయ్య చారి, వేణుగోపాల్‌రావు, తిరుమలేష్, జలంధర్, మౌనిక, శ్రావణి, రజిత పాల్గొన్నారు.