Breaking News

పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్

ఫిర్యాదులపై తక్షణం స్పందించండి

సారథి, ములుగు: జిల్లా పోలీస్ కార్యాలయంలో ములుగు ఏఎస్పీ పి.సాయిచైతన్య నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ ఇతరుల మృతికి కారణమైతే 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని, కావునా ప్రజలు ఎవరు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రోడ్డు నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను తగ్గించుకోవాలని, పారదర్శకంగా దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్ష పడేలా కృషిచేయాలని సూచించారు. మీసేవ ఫిర్యాదులు, స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీసు వాహనాల నిర్వహణపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏటూర్ నాగారం ఏఎస్పీ గౌష్ ఆలం, ఏఎస్ పి చెన్నూరి రూపేష్, ఎస్ బీ ఇన్​ స్పెక్టర్ రెహమాన్, సీసీఎస్ సీఐ సంజీవరావు, పసర సీఐ శ్రీనివాస్, ములుగు సీఐ గుంటి శ్రీధర్, ఆర్ఐ కిరణ్, స్వామి, జిల్లాలో పనిచేస్తున్న సబ్ ఇన్​ స్పెక్టర్లు పాల్గొన్నారు.