![‘రాధేశ్యామ్’ రెండో సాంగ్ రిలీజ్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/12/01HSB4.jpg?fit=224%2C164&ssl=1)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా నుంచి మరోసాంగ్ వచ్చేసింది. ముందుగా హిందీలో చిత్రీకరించిన ‘ఆషికీ ఆ గయా’ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. పాట ఆరంభంలో ‘నిన్ను నువ్వు రోమియో అనుకుంటున్నావా ?’ అని పూజా, ప్రభాస్‌ను అంటే.. ’అతడు ప్రేమ కోసం ప్రాణాలిచ్చాడు. నేను ఆ టైపు కాదు’ అని ప్రభాస్ బదులిస్తాడు. దీనికి ‘కానీ, నేను జూలియెట్. నన్ను ప్రేమిస్తే తప్పకుండా చచ్చిపోతావ్’ అని పూజా రొమాంటిక్‌గా వార్నింగ్ ఇస్తుంది. దీంతో ‘కానీ నేను మాత్రం ప్లర్టేషన్‌షిప్ కోరుకుంటున్నా’ అంటూ ప్రభాస్, పూజను కిస్ చేయడంతో పాట మొదలవుతుంది. ఈ సాంగ్‌లో విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ప్రభాస్, పూజా లుక్స్ అభిమానులకు పండగలా అనిపిస్తాయి. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రభాస్ పల్మానాలజిస్ట్‌గా ఆకట్టుకోబోతున్నాడు. ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది