Breaking News

తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.మార్చి 19 నుంచి ఆన్​ లైన్ లో అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా మే 5తో ముగియనుంది. ఇంజినీరింగ్ పరీక్షను జూలై 7, 8, 9 తేదీల్లో నిర్వహించనుండగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షను జూలై 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు రూ.800 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు రూ. 400 నిర్ణయించారు. ఈ రెండు పరీక్షలకు అప్లై చేయాలనుకునే వారికి ఫీజు రూ.1600 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.800 నిర్ణయించారు. పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in/లో పొందుపరిచారు.