సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం నూతన ఎస్సైగా తాండ్ర వివేక్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవాలన్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృభిస్తున్న నేపథ్యంలో ప్రజలు భౌతికదూరం, మాస్కులు, సానిటైజర్లు తప్పకుండా వాడాలన్నారు. తల్లిదండ్రులు మైనర్లుకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల పరిధిలో ఎవరైన అసాంఘిక కార్యక్రమాలు, గ్రామాల్లో కొత్తవ్యక్తులు సంచరిస్తే తమకు లేదా 100కు డయల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- May 3, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- Comments Off on రామడుగు ఎస్సైగా వివేక్ బాధ్యతలు స్వీకరణ