సామాజిక సారథి, పెద్దశంకరంపేట: ప్రతి గ్రామంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించేలా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, జనహిత ఏకోపాధ్యాయ పాఠశాల ఆచార్యులు, ఏర్పాట్లు చేసుకోవాలని జనహిత ఏకోపాధ్యాయ పాఠశాల మెదక్ జిల్లా ప్రముఖ పోచయ్య, పెద్దశంకరంపేట అఖండ ఆర్ఎస్ఎస్ కార్యవాహ జైహింద్ రెడ్డి, సహ కార్యవాహ సీతారామారావు కోరారు. బుధవారం పెద్దశంకరంపేట సరస్వతి శిశు మందిర్ లో ఆర్ఎస్ఎస్ బాధ్యులు, జనహిత ఏకోపాధ్యాయ పాఠశాల ఆచార్యల సమావేశం నిర్వహించారు. హిందూధార్మిక కార్యక్రమాలు, వరలక్ష్మీ వ్రతం, రక్షాబంధన్, గోకులాష్టమి, ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రతి గ్రామంలో అన్ని కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా పర్యావరణ ప్రముఖ్ రవివర్మ, పెద్దశంకరంపేట మండల ఆర్ఎస్ఎస్ బాధ్యులు కృష్ణమూర్తి, సతీష్ గౌడ్, వీరప్ప, విశ్వేశ్వర్ గౌడ్, జనహిత ఏకోపాధ్యాయ పాఠశాల బాధ్యులు శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, ఆయా గ్రామాల ఆచార్యులు పాల్గొన్నారు.
- August 18, 2021
- Archive
- Lifestyle
- మెదక్
- లోకల్ న్యూస్
- raksha bandhan
- RSS
- ఆర్ఎస్ఎస్
- రక్షాబంధన్
- Comments Off on ఊరూరా రక్షాబంధన్ వేడుకలు