సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేటకు చెందిన స్థానిక ప్రైవేట్ వైద్యుడు డాక్టర్ ఫణికుమార్ సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మాస్కులు శానిటైజర్ ను ఎస్సై నరేందర్ కు అందజేశారు. రెండో విడత కరోనా విజృంభిస్తున్న తరుణంలో పోలీసులు నిర్వీరామంగా అందిస్తున్న సేవలు, వారి భద్రత దృశ్య పోలీస్ సిబ్బందికి మాస్కులు శానిటైజర్లను అందజేసినట్లు డాక్టర్ ఫణికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరుణ రెండో విడత విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించి కరోనా విస్తరించకుండా తమవంతు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది మాస్కులు శానిటైజర్ ను అందించిన డాక్టర్ ఫణికుమార్ ను అభినందించారు. కార్యక్రమంలో ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- April 21, 2021
- Archive
- CARONA
- medak
- peddashankaram
- కరోనా
- పెద్దశంకరంపేట
- మెదక్
- Comments Off on మాస్కులు, శానిటైజర్ల అందజేత