Breaking News

పేదలకు ఆర్థికసాయం అందజేత

పేదలకు ఆర్థికసాయం అందజేత

సారథి, చొప్పదండి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకుని శనివారం పేదలకు సాయం చేశారు. చొప్పదండి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి కాట్నపల్లి గ్రామంలో కరోనాతో మృతిచెందిన గన్ను నారాయణరెడ్డి కుటుంబానికి రూ.ఐదువేల ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబసభ్యులు మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కట్టెకోల లక్ష్మణ్, గ్రామశాఖ అధ్యక్షుడు గన్ను సంతోష్ రెడ్డి, కోలపురి శ్రీకాంత్, చుప్ప శ్రీనివాస్, బండారి ఆంజనేయులు, బండారి రాజు, బండారి శంకరయ్య పాల్గొన్నారు.