సామాజికసారథి, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని భైరాపూర్ గ్రామంలో మూడు రోజుల నుంచి కొనసాగిన స్వయంభు లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం రథోత్సవం , చక్రస్నానం, ఆశీర్వచనం, దీపోత్సవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. మూడు రోజులుగా నుంచి నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామి వారి కల్యాణ మహోత్సవం, సోమవారం నిత్యహోమం, పూర్ణహుతి, పుష్పయాగం తదితర కార్యక్రమంలో మంగళవారం రథోత్సవం ముగించారు. బ్రహ్మోత్సవాలకు గ్రామస్తులు, బంధువులు పెద్దఎత్తున తరలివచ్చారు. గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్దార్ల కుమార్, ఉప సర్పంచ్ రమేష్ గౌడ్, తిరుగుడు రాజు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
బైరాపూర్ లో లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం