సామాజిక సారథి, పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని అల్లూరి సీతారామరాజు సెంటర్లో ప్రజలు నివసించే ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా బుధవారం ధర్ని నర్వహించారు. ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి వళ్ళం దాసు కుమార్, టి.ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బొట్ల రమేష్ జిల్లా అధ్యక్షుడు బొట్ల రమేష్, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోడేటి దయాకర్, మాదాసి యాకూబ్ మండల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి మాట్లాడారు. జనావాసాల మధ్యన వైన్ షాపులకు అనుమతులు ఇవ్వద్దని స్థానిక ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుని అధికారులు పట్టించుకోకుండా వైన్ షాప్ యజమానుల కొమ్ము కాస్తూ ప్రజలను మద్యానికి బానిసలుగా చేయడానికే అధికారులు ప్రభుత్వం పరోక్షంగా పనిచేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు యువకులు పాల్గొన్నారు.
- December 2, 2021
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- వరంగల్
- Comments Off on జనావాసాల్లో ఆ షాపులొద్దని నిరసన