సారథి, అచ్చంపేట: తమ భూములకు రక్షణ కల్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అంబగిరి గ్రామానికి చెందిన గిరిజన రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అటవీశాఖ అధికారులు గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ గతంలో ఉన్న ఫారెస్ట్ హద్దు కాకుండా సాగుభూముల్లో జేసీబీతో బౌండరీ తీయడానికి రావడంతో గిరిజనులు అడ్డుకున్నారు. ఈ భూములకు 2006లో అటవీహక్కుల చట్టం ప్రకారం దాదాపు 12 మంది రైతులకు పట్టాలిచ్చారు. అప్పటి నుంచి వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పనులు చేసుకోకుండా తమను అడ్డుకుంటున్నారని గిరిజనుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.
- June 10, 2021
- Archive
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- ACHAMPET
- forestlands
- NALLAMALA
- అచ్చంపేట
- నల్లమల
- ఫారెస్ట్ భూములు
- Comments Off on మా భూములకు రక్షణ కల్పించండి