Breaking News

అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించండి

అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించండి
  • కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న

సామాజిక సారథి, నాగర్ కర్నూలు: అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేసి, దుండగులను దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కులం, మతం ముసుగుతో రోజురోజుకు పెట్రేగిపోతుందని ఆరోపించారు. భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం నాయకులు నవీన్, బాబు, రాములు, కృష్ణ, చంద్రయ్య, చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.