Breaking News

ప్రైవేట్​ టీచర్లను ఆదుకోవాలి

ప్రైవేట్​టీచర్లను ఆదుకోవాలి

సారథి, చొప్పదండి: ప్రైవేట్​ టీచర్లను ఆదుకోవాలని అసోసియేషన్​అధ్యక్షుడు మాచర్ల మహేశ్​ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. సోమవారం కరీంనగర్​జిల్లా చొప్పదండి ఆకాశ్ పబ్లిక్ స్కూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి 18 నెలలు అవుతోందని, ప్రైవేట్​ఉపాధ్యాయులు మానసికంగా కృంగిపోయారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.2వేల ఆర్థిక సాయం, 25 కేజీల బియ్యం కొంత స్వాంతన కలిగించిందన్నారు. కానీ ప్రభుత్వం మూడునెలలకే ఆ సహాయాన్ని నిలిపివేసిందన్నారు. ప్రీ ప్రైమరీ టీచర్లు, ప్రైమరీ టీచర్లకు జీవనోపాధి లేక వారి బతుకుదెరువు అగమ్యగోచరంగా మారిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి స్కూళ్లను పూర్తిగా తెరిచేవరకు ఈ ఆర్థిక సహాయాన్ని కొనసాగించాలని కోరారు.