Breaking News

నమ్ము రూము​కు రమ్మంటున్నాడు

నమ్ము రూముకు రమ్మంటున్నాడు

  • సంతకం చేస్తుంటే చేయి పట్టుకున్నాడు
  • వీపనగండ్ల గురుకులంలో ప్రిన్సిపల్ కీచకపర్వం
  • మహిళా టీచర్​ను వేధిస్తున్న డి.శ్రీనివాస్​​
  • నాలుగు పేజీల లేఖలో లేడీ టీచర్ ​ఆక్రందన

సామాజిక సారథి, కొత్తకోట: వనపర్తి జిల్లా వీపనగండ్ల సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపల్ కీచరపర్వం సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. మ్యాథ్స్​ బోధించే ఓ మహిళా టీచర్​ను ప్రిన్సిపల్ డి.శ్రీనివాసులు కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో తాను ఎదుర్కొంటున్న మానసిక క్షోభను గుండెల్లో దాచుకొని.. కనీసం భర్తతో కూడా పంచుకోలేక.. ఎదుటివారికి చెప్పుకోలేక గురుకులాల పర్యవేక్షణ అధికారికి తన గాథను లేఖ రూపంలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ స్కూలుకు సొంత భవనం లేకపోవడంతో కొత్తకోటలోని ఓ ప్రైవేట్​ భవనంలో కొనసాగుతోంది. బాధిత టీచర్​ కథనం మేరకు..
లేఖలోని సారాంశం ఇదే..
‘‘ నేను ఈ స్కూలులో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాను. ఇక్కడ ప్రిన్సిపల్​ సార్​, క్లర్క్ తో ​కలిసి నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు. ప్రిన్సిపల్ ​సార్ ​ఒకరోజు నమ్ము రూమ్​కు రమ్మని పిలిచాడు. నీవు అందంగా ఉన్నావని అంటున్నాడు. ఎదురుచెప్పితే నన్ను అసభ్యకరమైన మాటలతో మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నాడు. నేను ఒకసారి ఆఫీసులో సంతకం చేస్తుండగా, వెనుక నుంచి వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పినా సరే నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు. ఆయనకు ఉన్న అధికారాలను వినియోగించుకోని నన్ను లొంగదీసుకోవాలని చూస్తున్నాడు. స్కూలులో కొందరు పార్ట్​టైమ్​టీచర్లను అర్హత లేకున్నా పీజీటీగా విధుల్లోకి తీసుకున్నాడు. ఈ విషయాన్ని వైస్​ప్రిన్సిపల్ ​గారికి కూడా చెప్పాను. స్కూలులో టీ మెస్​ స్టాక్ ​రిజిస్టర్ లో అవకతవకలు జరుగుతున్నాయి. నాకు ఏ విధమైన హానీ జరిగినా దానికి ప్రిన్సిపల్​ డి.శ్రీనివాసులు మాత్రమే కారణం” అని వాపోయింది. ఈ ఘటనపై ఆమె ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గురుకుల అధికారికి మాత్రమే లేఖ రాసింది. ఈ లేఖ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.