సారథి, చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి జిల్లాలోని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయని మెదక్ డీఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన చిన్నశంకరంపేట మండలంలోని కొరివిపల్లి సంగయ్యపల్లి, కామారం గ్రామాల్లో నర్సరీలు, డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. పరిశీలనలో భాగంగా సంతృప్తి వ్యక్తంచేశారు. ఎండాకాలం అయినప్పటికీ మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకుంటున్న సర్పంచ్ లు, అధికారులను అభినందించారు. ఆయన వెంట ఎంపీడీవో గణేష్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈజీఎస్ సిబ్బంది ఉన్నారు.
- May 28, 2021
- Archive
- మెదక్
- షార్ట్ న్యూస్
- CHINNASHANKARAMPET
- HARITHAHARAM
- medak
- చిన్నశంకరంపేట
- మెదక్
- హరితహారం
- Comments Off on హరితహారానికి మొక్కలు సిద్ధం