Breaking News

పెట్రోలు రేట్లు పెంచి దోచుకుంటున్నారు..

పెట్రోలు రేట్లు పెంచి దోచుకుంటున్నారు..

సారథి, అచ్చంపేట: నిత్యం పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదల నడ్డి విరుస్తున్నాయని యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ పెట్రోలు రేట్లు పెంచుతూ పేదలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంతో ఏడాది నుంచి లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని వివరించారు. 10నెలల కాలంలో పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై 26 పెంచారని ఆయన మండిపడ్డారు. కరోనా సంక్షోభంలో పేదలను ఆదుకోవాల్సింది పోయి దోచుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు శివకుమార్, నాగులు నాయక్, బాబా, మహేష్ పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అరెస్ట్
సారథి, జగిత్యాల: జీవన్ రెడ్డి ఇంటి నుంచి నాయకులు తహసీల్దాల్ ఆఫీసు చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతుండగానే పోలీసులు నాయకులను బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధుతో పాటు రఘువీర్ గౌడ్ కు గాయాలయ్యాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని అరెస్ట్ చేసి వాహనంలో ఎక్కిస్తుండగా స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. అనంతరం 200 మంది నాయకులు, కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో జగిత్యాల కొత్త బస్టాండ్ ప్రాంతం ఒక్కసారిగా రణరంగంగా మారింది. కాంగ్రెస్ శాంతియుత నిరసనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అత్యుత్సహం ప్రదర్శించారని నాయకులు మండిపడ్డారు.