సారథి, రామడుగు: పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి సృజన్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా రామడుగు అంబేడ్కర్ చౌరస్తాలో ఎడ్లబండితో నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధర కాకుండా అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అన్నివర్గాల ప్రజలపై భారం మోపుతున్నారన మండిపడ్డారు. చిరువ్యాపారులు, రైతులపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపు భారంగా మారుతుందన్నారు. ధరలు ఇలాగే ఉంటే భవిష్యత్ లో ఎద్దుల బండ్లు, సైకిళ్లపై ప్రయాణాలు చేసే పరిస్థితి వస్తుందన్నారు. పెట్రోధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, గంటే రాజేశం, ఎగుర్ల మల్లేశం, మచ్చ మహేష్, నర్సయ్య, ఐలయ్య, కనకయ్య, మాల్యల అంజయ్య, జవాజి ప్రకాష్, గుంటి శ్రీను పాల్గొన్నారు.
- June 18, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CPI
- MODI
- petrol rates
- RAMADUGU
- పెట్రోధరలు
- రామడుగు
- సీపీఐ
- Comments Off on పెట్రో ధరలు తగ్గించాలి