Breaking News

వాట్సాప్ లో వినతిపత్రం

వాట్సాప్ లో వినతిపత్రం

సారథి, రామడుగు: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్ని అతలాకుతలం చేస్తోందని రామడుగు బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కరుణాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైరస్ ఉధృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోందన్నారు. ప్రజలు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రుల్లో చేరితే, వసతుల లేమితో ఆస్పత్రులు కోట్టుమిట్టాడుతున్నాయన్నారు. ప్రాణాలు దక్కించుకుందామని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే, లక్షలాది రూపాయలను దండుకుంటున్నాయని ఆరోపించారు. కరోనా పేషంట్లకు కుటుంబం చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేక వేలాధి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న.. ఒక్క కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాత్రం అమలుకు నోచుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ఆయుష్మాన్ భారత్ ని ఓవైపు అమలు చేస్తూ, మరోవైపు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారని గుర్తు చేశారు. ఇప్పటికై సీఎం కేసీఆర్ స్పందించి రాష్ట్రంలో ఆయుష్మాన్ భారతితో పాటు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. రాష్ట్రంలో నేటి నుండి లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పలు శాఖల ఉన్నతాధికారులను ప్రత్యేక్షంగా కలిసి ప్రజాసమస్యలపై వినతిపత్రాలు ఇవ్వలేకపోవడంతో తహసీల్ధార్ కోమల్ రెడ్డికి వాట్సాప్ ద్వారా వినతిపత్రాన్ని అందిస్తున్నట్లు కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.