సారథి, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు హెల్త్‌సెంటర్‌ను డీఎంహెచ్‌వో డాక్టర్చందునాయక్ సందర్శించి ఇక్కడ అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. 45ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. కరోనా సెకండ్‌వేవ్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైద్యులు, డాక్టర్లు సమయపాలన పాటించాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అమరవాయి గ్రామంలో ఉన్న హెల్త్‌సబ్ సెంటర్ ను పరిశీలించి అక్కడ ఉన్న వైద్యసిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయా గ్రామాల సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా తీసుకోవాలని కోరారు. ఆయన వెంట డాక్టర్ సవిత, షబ్బీర్ హుస్సేన్, సూపర్ వైజర్ చంద్రన్న, తిరుమలరావు, సోని, నసీమా, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
- April 9, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- carona second wave
- GADWALA
- MANAVAPADU
- కరోనా సెకండ్ వేవ్
- జోగుళాంబ గద్వాల
- మానవపాడు
- Comments Off on 45ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్ తీసుకోవాలి