సారథి, మానవపాడు: ఎలాంటి అపోహలకు భయపడకుండా ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని మానవపాడు పీహెచ్సీ డాక్టర్శశికిరణ్కోరారు. శనివారం స్థానిక మానవపాడు పీహెచ్సీని గద్వాల డీఐవో డాక్టర్ శశికళ సందర్శించి వార్డుల రూములను పరిశీలించి రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు సమయానికి మిమ్మల్ని పట్టించుకుంటున్నారా? లేదా? ఏమైనా ఆరోగ్య విషయంలో ఇబ్బంది వస్తే వెంటనే స్పందించి చికిత్స అందిస్తున్నారా? లేదా? అన్న అంశాలను ఆరాతీశారు. 45 ఏండ్లు పైబడిన వారు తప్పకుండా కరోన టీకాను వేయించుకోవాలని సూచించారు. కరోనా పెరిగిపోతున్న దృష్ట్యా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ కరోనా నియమ నిబంధనలు పాటించాలని కోరారు. శనివారం సుమారు 190 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శశికిరణ్, చంద్రన్న, సంధ్యారాణి, సోని, షబ్బీర్ హుసేన్, షాజహన్, కృష్ణవేణి, డీపీహెచ్ ఎన్ వో వరలక్ష్మి, దేవమ్మ, తిరుమలరావు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
- April 22, 2021
- Archive
- CARONA
- GADWALA
- MANAVAPADU
- కరోనా వ్యాక్సిన్
- గద్వాల
- మానవపాడు
- Comments Off on 45 ఏండ్లు నిండినవారు వ్యాక్సిన్ తీసుకోండి