సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో పిడియాట్రిక్ వైద్యసేవలు అందించేందుకు సరైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. మంగళవారం వేములవాడ మండలం తిప్పాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నపిల్లలకు వైద్యసేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 50 పడకల్లో భాగంగా 20 పడకలు ఐసీయూ, మిగతా 30 పడకలు జనరల్ కు కేటాయించాలని ఆదేశించారు. ఆక్సిజన్ ట్యాంక్పనులను పరిశీలించారు. వీలైనంత త్వరగా వాటి నిర్మాణాలను పూర్తిచేసేలా చూడాలని కోరారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ రావు తదితరులు ఉన్నారు.
- July 20, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- collctor krishna bhasker
- SIRICILLA
- VEMULAWADA
- కలెక్టర్కృష్ణభాస్కర్
- వేములవాడ
- సిరిసిల్ల
- Comments Off on ప్రభుత్వ ఆస్పత్రిలో పిడియాట్రిక్ సేవలు