సారథి, కొల్లాపూర్: ఉపాధి హామీ పథకంలో చేసిన పనులను డబ్బులు చెల్లించాలని డిమాండ్‌చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు ఎంపీడీవో ఆఫీసు ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ.. కూలీలు ఉపాధి పనులు చేస్తున్నా ఏడు వారాల నుంచి కూలి చెల్లించడం లేదన్నారు. ఇప్పటివరకు ఎంత వస్తుందో కూలీలకు తెలియడం లేదన్నారు. పే స్లిప్ అందజేయాలని కోరారు. తాగునీరు, మెడికల్ కిట్ల అందుబాటులో ఉంచాలని, మాస్కులు సైతం ప్రభుత్వమే పంపిణీ చేయాలని కోరారు. ప్రతి వారం పని ప్రదేశంలో కొలతలు చేసి ఎంత కూలి వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. బకాయి కూలి డబ్బులు ఇవ్వకపోతే ఎంపీడీవో ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం టెక్నికల్ అసిస్టెంట్ గోవింద్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు సి.పర్వతాలు, జీఎన్ పీఎస్ నాయకులు బి.చంద్రమౌళి, రాములు, చంద్రయ్య, మేటీలు ప్రేమ్‌చంద్, తుమ్మల బాలపీరు, లక్ష్మయ్య లక్ష్మీచంద్రమ్మ, చెన్నమ్మ, కూలీలు పాల్గొన్నారు.
- July 2, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- EGS WORKS
- KOLLAPUR
- ఉపాధి హామీ
- కొల్లాపూర్
- నాగర్‌కర్నూల్
- Comments Off on చేసిన పనికి పైసలు ఇవ్వండి