సారథి న్యూస్, ఎల్బీనగర్: కొంతకాలంగా బకాయిలో ఉన్న జీతాలను వెంటనే చెల్లించి తమను విధుల్లోకి తీసుకోవాలని శ్రీచైతన్య కాలేజీ ఎదుట అధ్యాపకులు ఆందోళనకు దిగారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురిలో శ్రీచైతన్య కాలేజీ బ్రాంచ్లో క్లాస్రూమ్లోకి వెళ్లి అధ్యాపకులు స్వీయనిర్బంధం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా యాజమాన్యం జీతాలు ఇవ్వకుండా వేధిస్తోందని బాధిత లెక్చరర్లు ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ.. తమకు మాత్రం జీతాలు చెల్లించకుండా జీవితాలతో ఆడులాడుతోందని మండిపడ్డారు. పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించి తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తీసివేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- February 9, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- LB NAGAR
- NARAYANA
- SRICHAITANYA
- ఎల్బీనగర్
- నారాయణ
- శ్రీచైతన్య కాలేజీ
- Comments Off on శ్రీచైతన్య కాలేజీ లెక్చరర్ల ఆందోళన