Breaking News

పవన్ కళ్యాణ్ సుజీతో కాంబోలో కొత్త సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ తో ఒక భారీ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కోసం చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ లో ఈ ప్రతిష్టాత్మక చిత్ర పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సోమవారం జరిగింది. నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏఎం రత్నం, దిల్ రాజు, డా. కె యల్. నారాయణ, కెఎల్ దామోదర ప్రసాద్, బీవీఎస్ఎన్ ప్రసాద్, జెమిని కిరణ్, కృష్ణ, పీడీవీ ప్రసాద్, నిర్మాత కార్తికేయ, దర్శకులు హరీష్ శంకర్, శ్రీవాస్, వివేక్ ఆత్రేయ, కోనవెంకట్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, నర్రా శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసారు. భారీస్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ కెమెరా బాధ్యతలు చూడనుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ గా వ్యవహరించనున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. చిత్రానికి సంబంధించి ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఇతర వివరాలు త్వరలో వివరించనున్నారు.