సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు శనిగరపు ప్రకాష్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గురువారం పరామర్శించారు. శనిగరపు ప్రకాష్ తల్లి చెంద్రమ్మ ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూసింది. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రకాష్ కుటుంబ సభ్యులు, వెదిర వీడీసీ చైర్మన్ నాగుల రాజశేఖర్, కిమ్స్ లా కాలేజ్ చైర్మన్ రవీందర్ రావు, డీసీసీ ఉపాధ్యక్షుడు వెన్న రాజ మల్లయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. కాగా, తొలిసారి వెదిర గ్రామానికి వచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డికి గ్రామ వీడీసీ చైర్మన్ నాగుల రాజశేఖర్ ఆధ్వర్యంలో శాలువా కప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎడవెళ్లి సత్యనారాయణ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వెన్న రాజమల్లయ్య, శనిగరపు అనిల్ పలువురు పాల్గొన్నారు.
- April 30, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- MLC PALLA
- private colleges
- ఎమ్మెల్సీ పల్లా
- పీజీ కాలేజీలు
- ప్రైవేట్ డిగ్రీ
- వీడీసీ చైర్మన్
- శనిగరం ప్రకాష్
- Comments Off on ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించిన పల్లా