- రైతులకు తప్పని తిప్పలు
- కరెంట్ వసతి కల్పించాలని డిమాండ్
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్యాడి క్లీనర్ల లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొంతంగా ఎడ్ల బండ్లకు పంకలు కట్టి వడ్లు పడుతున్నారు. ట్రాక్టర్ పంకకు గంటకు రూ.వెయ్యి చొప్పున అద్దెకు తెచ్చుకుంటున్నారు. కనీసం ఉన్న రెండు ప్యాడి క్లీనర్లకు కరెంట్సౌలత్ లేక అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యాన్ని ఆరబోసేందుకు కల్లాలు లేకపోవడంతో పొలాలు, ఇళ్ల మధ్యలో వరి ధాన్యాన్ని ఎండబెట్టుకుంటున్నారు. తీరా నూర్పిడి చేసిన ధాన్యాన్ని తాలు పేరుతో రైస్ మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. ప్యాడి క్లినర్లను అదనంగా తెప్పించి, వాటికి కరెంట్ వసతి కల్పించాలని రైతులు కోరుతున్నారు.